జీవితం తలమానిక మయినది అంటారు పెద్దలు
ఆ జీవిత ప్రయాణం లో ఎంతో మందిని కలుస్తూ వుంటాము
కానీ కొంత మంది మన ఎద లోయల్లో నిలిచి పోతారు
అటువంటి వారిలో ఒకరే ఈ ప్రత్యేక వ్యక్తి ....
పరిచయమయి దాదాపు రెండేళ్ళు అవుతోంది
కలిసిన ప్రతిసారి ఓ వైవిధ్యం జరిగినట్టు అగుపిస్తుంది
తలచుకునదే తడువు ఎద పులకరించి పోతుంది
ఏమి అంత విశిష్టత ఉంది అన్న తలంపు కూడా ఆహ్లదన్ని కలిగిస్తుంది.
నా సొంతం కాదు అన్న సత్యం మదిని కలిచివేస్తుంది...
పెద్దలు పట్లు గౌరవం, వారి ఫై అనురాగం ఎవ్వరి నైన మొగ్గులో దించి వేస్తుంది
ప్రస్తుత సామజికానికి కనుమరుగాయి పోతున్న మనదయినా సంప్రదాయం పట్ల తమరికి ఉన్న ఆప్యాయత ఎటువంటి వారిని అయిన మంత్ర ముగ్దులని చేస్తుంది
నాటకమే జీవితంగా జివిస్తున్నప్పటికి మన ప్రాచీన విలువలకి సమయం వెచ్చిస్తున్న మిమ్ములని చూసి నేటి తరం నేర్వవలసినది ఎంతో ఉంది
అపారమయిన జ్ఞాన సంపద ఉన్న నాకేమి తెలియదు అనేటువంటి మీ వినయం మా వంటి వారిని సిగ్గు తో తలదించుకొనేలా చేస్తున్నది....
తమరికి ఉన్న గౌరవం,వినయ విధేయతలు,ప్రేమ, కరుణ,జ్ఞానము అన్నిటికి ఇవియే నా జోహార్లు
మీ సుగుణ సంపదలు వర్ణించుటకు నా ప్రామాణిక కాలం సరిపోదు
తమరితో సంభాషనయే కష్టం అనుకున్న నాకు ఎన్నో సంతోష - బాధలు పంచుకోగలిగిన భాగ్యం దక్కినది
ధర్మం - ప్రేమ అనే యుద్ధము లో అత్యోత్తమం అయిన ధర్మముని గెలిపించుటకయి మీకుగా మీరు వేసుకున్న శిక్షకి ఇవియే నా కన్నీటి వందనములు.....
ధర్మో రక్షతి రక్షితః అన్న దానిని మౌనం గా ఆచరణ లో పెట్టిన మీకు పాదాభి వందనం.
No comments:
Post a Comment